26న జిల్లాస్థాయి యోగా పోటీలు

మహాతెలంగాణ/మహబూబాబాద్:

ఈ నెల 26న ఆదివారం ఉదయం 10 గంటలకు జడ్పీహెచ్ఎస్ జమాండ్ల పల్లి పాఠశాల లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగ అసోసియేషన్ అధ్యక్షులు తూనం పుష్పలీల, కార్యదర్శి గుజ్జునూరు నరేష్ తెలిపారు.సబ్ జూనియర్, జూనియర్ ,సీనియర్, మాస్టర్స్ ,గ్రూప్ లకు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వివరాలకు 9985185257, 8919703008 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు. 10 నుంచి 14 సంవత్సరాల వయసు,14నుంచి18,18 నుంచి 28,28 నుంచి 38,38 నుంచి 45,45 నుంచి 55 సంవత్సరాలు, ఆయా వయసుల వారీగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *