మహా తెలంగాణ/మహబూబాబాద్ :
రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయాలని, మేలైన యాజమాన్య పద్ధతులు అయిన మల్చింగ్, బిందు సేద్య, సేంద్రీయ పద్దతులు, పందిరి సాగు, మొదలైనవి పాటించాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మహబూబాద్ మార్కెట్లో కూరగాయలు అమ్మకాలు జరుపుతున్న రైతు భూక్యా యేసుకు, ఇతర రైతులకు ప్రభుత్వం ఇచ్చే పందిరి సాగు, మల్చింగ్, బిందు సేద్యం, నీటి కుంటలు (పంట కుంటలు), మొదలైన రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.