శ్రీ నేత్ర కంటి ఆసుపత్రి అండ్ ఆప్టీకల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్ చంద్రనాయక్

మహాతెలంగాణ/మరిపెడ,

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ మహేష్ ఎం.డి ఆప్తమాలజిస్ట్,డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నేత్ర కంటి ఆసుపత్రి అండ్ ఆప్టికల్స్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోతు రవి,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పానుగోతు రాంలాల్,కౌన్సిలర్లు కాంతమ్మ,గంధసిరి బిక్షపతి,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలాజీ,సొందు,లింగయ్య,సత్యం,నిర్వాహకుల కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *