మహా తెలంగాణ/మరిపెడ
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్‌ను తొర్రూరు విద్యుత్ శాఖ డీఈగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. విద్యుత్ శాఖ అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మరిపెడ సబ్ డివిజన్ ఏడీఈ శ్రీనివాసరావు, ఏఈలు పాండు నాయక్, మహిముద్, రూబీనా, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.