ఖాళీగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి: అల్వాల వీరయ్య

మహా తెలంగాణ/మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ప్రజా సంఘాల భవనంలో శనివారం సిపిఐ(ఎం) కామ్రేడ్ తాటికొండ అనంతచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అల్వాల వీరయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రా,రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 12 సంవత్సరాలు గడిచిన నేటికీ వాటిని భర్తీ చేయలేదని,కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు.రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20000 ఉద్యోగాలను,డిఎస్సి,జెల్,డిఎల్,గ్రూప్ 1,2,3,4, కేటగిరీల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలన్నారు.ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నెలకు నిరుద్యోగులకు 5 వేల రూపాయలు నిరుద్యోగభివృద్ధి ఇవ్వాలన్నారు.రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని,స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పించాలని,ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండాగాని మధుసూదన్,మండల నాయకులు బాణాల రాజన్న,కొండ ఉప్పలయ్య,అల్వాల యాకమ్మ,తాడూరి వీరేంకులు,చెన్నబోయిన లాలయ్య,నలబొరు లక్ష్మారెడ్డి,ఎస్.కె ఇమామ్ సాబ్,మొగిలి యాకయ్య,పోలేపక గణేష్,ఎల్లమ్మ,భూక్య చంద్రనాయక్,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *