కాంతమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

మహా తెలంగాణ/మరిపెడ:

అనారోగ్యంతో మృతి చెందిన పోతుల కాంతమ్మ (85) మృతదేహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామ చంద్రు నాయక్ సందర్శించి నివాళులర్పించారు.అనంతరం సీనియర్ జర్నలిస్టు పోతుల గోవర్ధన్, వారి సోదరులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పి భరోసా కల్పించారు. వారికి తక్షణ సాయం కింద ఆర్థిక చేయూతను అందించారు. అదేవిధంగా పట్టణానికి మండలానికి చెందిన సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, జర్నలిస్టులు ఉన్నారు. పరామర్శించిన వారిలో కో ఆప్షన్ సభ్యుడు షేక్ అజీజ్, మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, గంధసిరి అంబరీష, 13వ వార్డు అధ్యక్షుడు వేర్మారెడ్డి వెంకటరెడ్డి, కుడితి వెంకటరెడ్డి, అడ్వకేట్ సైదులు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు రషీద్, సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్, పి ఆర్ టి యు అధ్యక్షుడు మహేష్ గౌడ్, టిపిటిఏ జిల్లా నాయకులు బోడా రాంజీ, పి ఆర్ టి యు నాయకుడు నగేష్, జర్నలిస్టు జిల్లా నాయకులు గుట్టయ్య, చక్రధర్, శేఖర్, దాసరోజు బాలకృష్ణ, మరిపెడ సీనియర్ జర్నలిస్టులు సత్తార్ పాషా, వీరాంజి, లచ్చయ్య, రియాజ్, అక్తర్ పాషా, రాజేష్, వేణు, బోడ నాగేందర్, సంజీవ, బోడపట్ల వెంకన్న, కపిల్, తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *