సిపిఐ నాయకుడు గుండు సోమన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమం.

మహా తెలంగాణ/ కేసముద్రం:

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని విలేజ్ కేసముద్రం సిపిఐ సీనియర్ నాయకులు గుండు సోమన్న ప్రధమ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న బి విజయ సారధి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండు సోమన్న సిపిఐ పార్టీలో కీలకపాత్ర పోషించి పేదల పట్ల రైతు కూలీల పట్ల పోరాటాలు చేసి పాలేరుల పక్షాన నిలబడి ఆనాటి భూస్వాముల పెత్తందారులకు తల ఇవ్వకుండా సిపిఐ పార్టీ ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి అని కొనియాడారు.
సిపిఐ పార్టీకి ఎనలేని సేవలు చేసిన సోమన్న అని అన్నారు కామ్రేడ్ గుండు సోమన్న నాలుగు దిశబ్దాల కాలంలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పని చేశారని అన్నారు గుండు సోమన్న ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉందని వారన్నారు జరిగిన రైతన్న భూ పోరాటాలపై కార్మికుల కర్షకుల హక్కులకై పోరాడిన వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ చొప్పరిశేఖర్ సిపిఐ నాయకులు మడత నారాయణ వీరస్వామి ఉపేందర్ కరుణాకర్ కోటయ్య దాసరి సాయిలు ఐలయ్య యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *