నేటినుంచి మహబూబాబాద్ జోన్ ఎస్ జి ఎఫ్ క్రీడలు

జోనల్ మీట్ ఆఫీషియల్స్ టీ షర్ట్స్ విడుదల

మహాతెలంగాణ/మహబూబాబాద్:

ఈనెల 10 నుండి 11వ తేదీ వరకు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామం పి ఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జరగబోయే 70వ ఎస్ జి ఎఫ్ మహబూబాబాద్ జోనల్ స్థాయి( బయ్యారం, గార్ల, మహబూబాబాద్ మండలాలు )క్రీడలకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా క్రీడలు ఆడించే ఆఫీషియల్స్ కు టీ షర్ట్ దాతలు పాఠశాల హెచ్.ఎం కుంజర గిరిజ, కొమిరే ఉప్పలయ్య, తక్కిళ్ళపల్లి వీరభద్రం, ఒ డ్డేటి ఝాన్సీలు గ్రామ సర్పంచ్ చీరిక వసంత ఉపేందర్ రెడ్డి ఉప సర్పంచ్ కమటం యాకన్న గార్ల సమక్షంలో టీషర్ట్స్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ రామ సహాయం శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉప్పలయ్య, సోహందు బి, శిభారాణి,శ్రీనివాసరావు, కృష్ణమూర్తి,మల్లారెడ్డి,,యుగంధర్,ఈ.వెంకటేశ్వర్లు, సోమేశ్వర్, యాకుబ్ పాషా, మహబూబాబాద్ జోన్స్ సెక్రెటరీ మహంకాళి వెంకటేశ్వర్లు మరియు ఎస్జీఎఫ్ మహబూబాబాద్ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ అవారి శ్రీనివాస్, పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *