మహా తెలంగాణ/దంతాలపల్లి :
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల వ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషధారణలో అలరించారు. పాఠశాల ఆవరణంలో విద్యార్థులు ఉట్టుకొట్టారు. పాఠశాల ఆవరణంలో సందడి చేశారు. మండల కేంద్రంలోని కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ఆ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు.