పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడిగా మద్ది వినోద్ కుమార్ ఎన్నిక

మహా తెలంగాణ/మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం (టీపీఎస్‌ఎఫ్) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా మద్ది వినోద్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా గోపీచంద్,కోశాధికారిగా విప్లవను ఎన్నుకున్నారు.మరో 26 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మద్ది వినోద్ కుమార్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.అయితే విధి నిర్వహణలో అధిక పనిభారం,సిబ్బంది కొరత,అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.పంచాయతీ కార్యదర్శులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఇన్‌చార్జి బాధ్యతల పేరుతో కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి చేయడం,వేధింపులకు గురిచేయడం నిలిపివేయాలని కోరారు.గ్రామపంచాయతీల్లో పరిపాలన సజావుగా కొనసాగేందుకు కార్యదర్శులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని,విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.ఎన్నికైన కమిటీకి పలువురు పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *