మహా తెలంగాణ/కేసముద్రం:
కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామంలో ఈ నెల 18, 19 తేదీలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ జోనల్ స్థాయి క్రీడా పోటీలలో మహమూదుపట్నం శివారులోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కబడ్డీ అండర్-17 విభాగంలో భూక్య విజయ్, అండర్-14 విభాగంలో భూక్య మోహన్, అజ్మీరా జ్ఞానేశ్వర్, కోకో అండర్-17 విభాగంలో వాంకుడోత్ భరత్, కుండే ప్రణయ్, వాంకుడోత్ నగేశ్, కోకో అండర్-14 విభాగంలో బానోత్ అనిరుద్, గుగులోతు నవదీప్, వాలీబాల్ అండర్-14 విభాగంలో చిలుకూరి శ్రీచందు, సపావట్ మోహన్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.సోమవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్, ప్రిన్సిపల్ చిర్ర నరేశ్ విద్యార్థులను అభినందించారుఈ సందర్భంగా చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని, జిల్లా స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకుల కృషి ఎంతో ఉందని కొనియాడారు.