ఎంసీవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుక

మహబూబాబాద్ :

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఎం సి వై ఎఫ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకను ఘనంగా నెహ్రూ సెంటర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ టౌన్ ఎస్ హెచ్ ఓ సి ఐ మహేందర్ రెడ్డి పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరినొకరు నోటి తీపి చేసుకున్న అనంతరం 300 మంది పేదలకు దుప్పట్లు మరియు కేక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ గట్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే సందేశాన్ని ఇచ్చి ప్రపంచానికి మానవత్వాన్ని ప్రజ్వలింపజేసిన మహోన్నతుడు మహనీయుడు ఏసుక్రీస్తు అని కొనియాడుకుంటూ సర్వమానవాళి శాంతి సమాధానాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ సహోదర ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు క్షమాగుణం కలిగి ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరు చెడు అలవాట్లకు దూరం ఉండి భక్తిశ్రద్ధలతో సంతోషకరమైన జీవితాన్ని జీవనాన్ని కొనసాగించాలని అన్నారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎంసీవైఎఫ్ సభ్యులను అభినందించారు భవిష్యత్తులో ఎంసివైఎఫ్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎం సి వై ఎఫ్ అధ్యక్షులు చాగంటి కరుణాకర్ ,జన్ను మహేందర్, నర్రా శ్రావణ్, పిట్టల గణేష్ ఎండి పిఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెపాక తిమోతి, షారోన్ సంపత్, ఐపిసి మోజస్, దుర్గం సుధాకర్, మోతిలాల్, జాన్ వెస్లీ, బుచ్చన్న, వెంకటరెడ్డి, అంబేద్కర్, ఆరాధ్య, అబ్రహం, ప్రభుచరణ్, డేవిడ్, మోషే తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *