12న ఉషోదయ వాకర్స్ ఆధ్వర్యంలో వాకింగ్ పోటీలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఉషోదయ వాకర్స్ ఆధ్వర్యంలో మన ఉషోదయ కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాకింగ్ పోటీలు తేదీ 12 జనవరి 2026 న ఉదయం 7గంటలకు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ముగ్గురు కలిసి పచ్చ జెండా ఊపి వాకింగ్ పోటీలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ వాకింగ్ పోటీ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహబూబాబాద్ డిఎస్పి గారైన శ్రీ తిరుపతి రావు గారు హాజరు కానున్నారు. ఈ వాకింగ్ పోటీలలో పాల్గొనే ఉషోదయ సభ్యులందరూ రేపు ఉదయం 7గంటల నుండి మన కోశాధికారి సాధు మహిపాల్ రెడ్డి దగ్గర లేదా కాపరబోయిన శ్రీనివాస్ గారి దగ్గర గాని తమ యొక్క పేర్లను వయసుల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. 45- 50 సంవత్సరములు వరకు, 51- 55 సంవత్సరముల వరకు, 56- 60 సంవత్సరముల వరకు , 61- 65 సంవత్సరముల వరకు, 66- 70 సంవత్సరముల వరకు, 71 సంవత్సరము నుండి ఎంతవరకైనా శనివారం మరియు ఆదివారం రోజులలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలరని మనవి.
ప్రతి ఏజ్ గ్రూపు నుంచి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి ఉంటున్నాయి. మొదటి బహుమతి ఒక వెయ్యి 16 రూపాయలు మరియు మెమొంటో. రెండవ బహుమతి. 750 రూపాయలు మరియు మెమొంటో. మూడవ బహుమతి 516 రూపాయలు మరియు మెమొంటో. అందరూ పాల్గొనండి అందరూ ఆనందించండి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *