గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సమ్మర్ ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంపులు

మహబూబాబాద్ లో రెగ్యులర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ఏర్పాటుకు సహకరిస్తాం

ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (WDCA) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ది ప్రవీణ్ గౌడ్, చాగంటి శ్రీనివాస్ (మార్షల్)

గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సమ్మర్ ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంపులుమహబూబాబాద్ లో రెగ్యులర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ఏర్పాటుకు సహకరిస్తాం ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (WDCA) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ది ప్రవీణ్ గౌడ్, చాగంటి శ్రీనివాస్ (మార్షల్) మహాతెలంగాణ/మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత నెల రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్రికెట్ ఉచిత క్యాంప్ ముగింపు ఉత్సవము మరియు క్రికెట్ టోర్నమెంట్ లోగెలిచిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఓల్డ్ సిద్ధార్థ స్కూల్ ప్రక్కన నీలం బ్రదర్స్ గ్రౌండ్లో ఘనంగా మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ది ప్రవీణ్ గౌడ్, చాగంటి శ్రీనివాస్ (మార్షల్) నువ్వు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉచిత సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి భవిష్యత్తులో వారిని రాష్ట్ర జాతీయ జిల్లాల స్థాయికి తీసుకపోవడమే అసోసియేషన్ లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెగ్యులర్ ఉచిత క్రికెట్ క్యాంపు నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ ఉచిత క్యాంపు ద్వారా మనుకోట క్రీడాకారులు మంచిగా రాణిస్తున్నారని భవిష్యత్తులో మానుకోట అన్ని రంగాల్లో క్రీడలలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. టి20 వరంగల్ వారియర్స్ కు మానుకోట జిల్లా నుంచి ఆడిన ఇద్దరు ప్లేయర్స్ సాయి మరియు సంతోష్ సెలెక్ట్ అవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మానుకోట కు క్రికెట్కు అండదండలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ మరియు ఉమ్మడి వరంగల్ క్రికెటర్ అసోసియేషన్ డబ్ల్యూ డి సి ఏ నుంచి పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహిస్తూ క్రీడాకారులకు మంచి భవిష్యత్తును అందిస్తున్న మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ని అభినందించారు. అనంతరం టోర్నమెంట్స్ లో గెలిచిన టీమ్స్ కు మరియు రన్నర్ ఆఫ్ టీమ్స్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ షీల్డ్లు మరియు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి అధ్యక్షత వహించగా డబ్ల్యూ డి సి ఏ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రఘురాం రెడ్డి, సెలక్షన్ కమిటీ చైర్మన్ పి శ్రీనివాస్ గౌడ్ లతోపాటు క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ బి,విజయ సారథి, చీఫ్ కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ లు తోట నవీన్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రావుల నవీన్ రెడ్డి, సహాయ కోచ్ సాద్విత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిట్టల శ్రావణ్, అసోసియేషన్ మెంబర్ పరమేశ్వర్, నీలం బ్రదర్స్ గ్రౌండ్ యజమాని నీలం వెంకటేశ్వర్లు, క్రీడాకారులు చరిత్ రెడ్డి, బి ధర్మచంద్ రెడ్డి, ప్రణయ్ అనిర్వేశ్, జైనీల్, పెరుగు కుమార్, తండ సందీప్, రవి రమేష్,మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిథులను బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *