కురవి మండల కేంద్రంలో శిధిలావస్థలో ఉన్న అంబేద్కర్ భవనం పునరుద్ధరణ పనులకోసం తనవంతు సహాయంగా రూ.25 వేల రూ” చెక్కును అంబేద్కర్ కమిటికి అందజేత
మహా తెలంగాణ/ కురవి
అంబేద్కర్ భవనం నిర్మాణానికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నెహ్రూ నాయక్ కురవి మండల కేంద్రంలో శిధిలావస్థకు చేరుకున్న అంబేద్కర్ భవనం పునరుద్ధరణ పనుల కోసం *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ తన వంతు సహాయంగా రూ.25 వేల చెక్కును అందజేశారు.ఈ విరాళాన్ని అందించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడంలో అంబేద్కర్ భవనాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కురవి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం శిధిలావస్థలో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. భవనం పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ, సహకారం అందించాలని పిలుపునిచ్చారు…..ఈ కార్యక్రమంలో కురవి మాజీ సర్పంచ్ బానోత్ తుకారం నాయక్,ప్రధాన కార్యదర్శి ఆవిరే మోహన్ రావు,స్థానిక వార్డు సభ్యులు దైదా భద్రయ్య,యుత్ అధ్యక్షులు శరత్, నాయకులు బానోత్ లక్ష్మణ్,శ్యామల శ్రీనివాస్,ముత్తిలింగం,వీరన్న,నరేష్ కమిటీ సభ్యులు,ఇరుగు వెంకన్న,రమణ,నాగరాజు, నాయకులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.