మహా తెలంగాణ/మహబూబాబాద్:
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి 18 వ వార్డు అంగన్వాడి టీచర్ జ్యోతి కౌన్సిలర్ రేషపల్లి నవీన్ ను ఆహ్వానించగా వారు మాట్లాడుతూ అమ్మ మాట అంగన్వాడి పాట అనే మంచి కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలను మొదట అక్షరాభ్యాసం నేర్పించేది అంగన్వాడీలే అంటూ తల్లితండ్రులైతే ఈ విధంగా చిన్న పిల్లల ఆలన పాలన చూస్తారో అంగన్వాడికి వచ్చిన తర్వాత వారి ఆలన పాలన చూడటం టీచర్లు ఆయాలు బాధ్యత వహిస్తూ వారి మంచి చెడులు చూడడంతో పాటు అంగన్వాడీల ద్వారా ఓనమాలు క్రమశిక్షణ నేర్పించే విధంగా తయారు చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తారంటూ కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారంటూ టీచర్ ఆయా పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కనీస వేతనం 26 వేల ఇవ్వాలని PF. ESI సౌకర్యం కల్పించి అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టుల విషయంలో అధికారులు ఎవరూ కూడా ఎటువంటి కొర్రీలు పెట్టకుండా పోస్టులను భర్తీ చేయాలన్నారు……. కార్యక్రమంలో టీచర్. ఆయా… రన్వాల్ జ్యోతి.. బాదవ జ్యోతి.. పిల్లల పేరెంట్స్.. ఆబోతు అశోక్ . అచ్చమ్మ. చిన్నారులు.. తదితరులు పాల్గొన్నారు