బ్రాహ్మణపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఘన స్వాగతం
మహా తెలంగాణ/మహబూబాబాద్ :
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల బ్రాహ్మణపల్లిలో పాఠశాలను మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు, బెలూన్స్, పూలతో సుందరంగా అలంకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం బ్యాండ్ మేళాలతో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధారావత్ బద్రు గారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో డీఈవో గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. ప్రభుత్వ బడి అమ్మ ఒడితో సమానమని అన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వారి గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించేలా కృషి చేసి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు. బ్రాహ్మణపల్లి పాఠశాల ఉపాధ్యాయులు కుప్పం సూర్యతేజ పాఠశాల విద్యార్థుల అభ్యసనం మెరుగుపరచడానికి, డిజిటల్ విద్యను అందించదానికి పాఠశాలకు 15 వేల విలువగల ఎల్ఈడి టీవీ బహుకరించారు. దీనిని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు డీఈవో గారి చేతుల మీదుగా పుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట ఎల్లేష్, ఉపసర్పంచ్ బండారి మహేష్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారులు వంగ సురేష్, మోత్కూరి వెంకటేశ్వర్లు, జి సి డి ఓ యద్దనపూడి గాయత్రి, పాఠశాల ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజు,రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ, భానోత్ శంకర్, గిద్దె శృతి తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ బాలికల ప్రాథమిక పాఠశాలలో …
మహబూబాబాద్ బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా బాల బాలికలకు పూలగుచ్చమిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు మరింత కృషి చేసి అత్యున్నత బోధన ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా విద్యాశాఖకు మరింత పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ వెంకటేశ్వర్లు గారు, సీఎంఓ సురేష్ గారు, జి సి డి ఓ గాయత్రి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంజీ నాయక్ ఉపాధ్యాయ బృందం కిషన్, సత్యవతి, నాగముని, వరలక్ష్మి, చామంతి, సృజన, లక్ష్మీ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణవాసులు పాల్గొన్నారు.