ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాసనాలు కీలకం

2వ వార్డు కౌన్సిలర్ అంబాల శివకుమార్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాసనాలు కీలకమని మహబూబాబాద్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ అంబాల శివకుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ – 2026 పోటీలు జిల్లా లోని జమాండ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో అంబాల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పథకాలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో యోగాసనాలు ఎంతో కీలకమని, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, విజేతలకు, నిర్వాహకులకు ఉపాధ్యాయులను కౌన్సిలర్ శివకుమార్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి గుజ్జునూరి నరేష్ కుమార్, శోభ, పాఠశాల అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *