మహబూబాబాద్ జిల్లా విద్యా,వైజ్ఞానిక తరగతులు జయప్రదం చేయండి: పి డి యస్ యూ

మహబూబాబాద్ :

జూలై 28 న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ పట్టణం టిపిటిఎఫ్ భవణంలో పి డి యస్ యూ జిల్లా విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహిస్తున్నామని, రాజకీయ తరగతులు జయప్రదం చేయాలని పి డి యస్ యూ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌతమ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఆదివారం మహబూబాబాద్ పట్టణంలో జరిగిన పి డి యస్ యూ ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేడు దేశంలో విద్యార్థుల మెదళ్ళకు మత భావాలను జొపించి కుల,మత బేధాలుగా విభజించి పాలిస్తున్న తరుణం లో విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం అవసరమని ఆయన అన్నారు. విద్యార్థులలో ప్రశ్నించే తత్వం, క్రమశిక్షణ, సామాజిక దృక్పథం, హక్కుల సాధనకై పోరాడే చైతన్యం, పెంపొందించెందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. పి డి యస్ యూ ఆధ్వర్యంలో జరగబోయే క్లాసులో ప్రారంభ ఉపన్యాసపలుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను సీపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, నిర్మాణం,పని విధానం పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ చరిత్ర ను పి డి యస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు బోధిస్తారని, ముగింపు ఉపన్యాసం పి డి యస్ యూ రాష్ట్ర కార్యదర్శి అనిల్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పి డి యస్ యూ నాయకులు సాగర్, ప్రవీణ్,దేవాంస్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *