కబడ్డీ లో మెలకువలు నేర్చుకుని జాతీయ స్థాయి లో రాణించాలి

అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సంద వీరన్న

కబడి జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక

మహా తెలంగాణ/ మహబూబాబాద్ :

క్రీడాకారులు కబడ్డీలో మెలకువలు నేర్చుకుని జాతీయస్థాయిలో రాణించేలా క్రీడలో రాణించాలని కబడ్డీ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా సెక్రటరీ సంద వీరన్న సూచించారు ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సబ్ జూనియర్ కబడ్డీ బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు ఉంటుందని ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి సిరిసిల్ల రాజన్న జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అందులో పాల్గొనే ముందు క్యాంప్ శిక్షణలో మెలకువలు నేర్చుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి జిల్లాకు పతకం సాధించడానికి కృషి చేయాలని క్యాంపుకు ఎంపికైన క్రీడాకారులను సూచించారు. క్రీడాకారులు హోరాహోరీగా ప్రతిభను కనపరుస్తూ ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మద్ది వెంకటరెడ్డి, జాయింట్ సెక్రెటరీలు చాంప్లా నాయక్, అనిల్ యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఈసం పద్మ, జెహరా, వసంత, లక్ష్మి, గంగ, రవీందర్, కొమరయ్య, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *