మహా తెలంగాణ/మరిపెడ:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.5వ వార్డు కౌన్సెలర్ బోడ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రెడ్యానాయక్,జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరయ్యారు.వారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ పట్టణ ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.వార్డు కౌన్సెలర్ బోడ భాస్కర్ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.పట్టణ ప్రజలందరి సహకారంతో కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో,విజయవంతంగా ముగిసింది.