మహాతెలంగాణ /మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సార్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా గణనాధుని నిమజ్జనయాత్ర కన్నుల పండుగల వైభవంగా జరిగింది. కాలనీవాసులు,పెద్దలు, మహిళలు, చిన్నారులు కోలాట నృత్యాలతో గణనాథుని గంగమ్మ ఒడికి సాగనంపారు. ఇంటింటికి హారతులు పడుతూ భక్తి పారవశ్యంతో గణనాథుని ఆటపాటలతో చిన్నారుల కేరింతలతో నిమజ్జన యాత్ర ఘనంగా జరిగింది. తొమ్మిది రోజులు పాటు కాలనీవాసులు కుటుంబ సమేతంగా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి నిత్యం ఆట పాటలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పసునూరి విద్యాసాగర్, తీగల దుర్గేష్, కాకి మనోహర్, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.