మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. మురళీనాయక్
రూ.60కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
11వ వార్డు లో సిసి రోడ్డు కు శంకుస్థాపన
మహాతెలంగాణ/మహబూబాబాద్:
మానుకోటకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మురళీనాయక్ మార్క్ ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. మురళీనాయక్ స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు హస్తినాపురం లో సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పైలాన్ కే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో అభివృద్దే లక్ష్యంగా, ప్రజా సంక్షేమే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. మానుకోటకు రూ 350కోట్ల వ్యయం తో త్వరలో రింగ్ రోడ్డు వస్తుందని, డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కురవి రోడ్డు జంక్షన్ ను సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఏదేమైనప్పటికి వచ్చే 6నెలల్లోనే మానుకోటను ఊహించని అభివృద్ధి మీరే చూస్తారని, 5సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత జరిగింది మానుకోట బ్లూ ప్రింట్ ప్రజల ముందు చూపిస్తానని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో డి ఇ ఉపేందర్, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు గణపురపు అంజయ్య, కాలనీ వాసులు వంగ రమణ, కల్లూరి ప్రభాకర్, దారా వెంకటేశ్వర్లు, ఇందుభారతి, మాజీ కౌన్సిలర్ భూక్య లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ, రవీందర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.