మహాతెలంగాణ/ మహబూబాబాద్:
పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలిగా జిల్లా లోని బయ్యారం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు యద్దనపూడి గాయత్రి నియామకమయ్యారు. పి ఆర్ టి యు సంఘ అభివృద్ధితో పాటుగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆమె సేవలు అందించారు. పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షరాలుగా తన ఎంపికకు కృషిచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు మిరియాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీధర్, ఏఐఎఫ్టిఓ జాతీయ ఉపాధ్యక్షురాలు నూకల గీతారెడ్డి, బయ్యారం మండల అధ్యక్ష, కార్యదర్శి మోహన్, శ్రీనివాస్ కి ఈ సందర్భంగా గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు. గాయత్రి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షరాలుగా ఎన్నికల కావడం పట్ల పి ఆర్ టి యూ నాయకులు వెంకటేశ్వర్లు, రవి, మోహన్, భవాని, నవత,సునీత, , పల్లవి, శ్రీలత, అరుణ, లక్ష్మి,తదితరులు అభినందించారు