200 మంది కూలీల కష్టాన్ని కాజేసిన వారిపై జర్యలు తీసుకొని రికవరీ చేయాలి
ఎఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షుడు మ మాగం లోకేష్
మహా తెలంగాణ/గార్ల ;
రెండువందల మంది నిరు పేద కూలీలు మూడు నెలలు కష్ట పడి శ్రమించిన ఎన్ఆన్ఇజిఎన్ డబ్బులను కాజేసిన అవినీతి పరుడైన వ్యక్తికి నేడు కొందరు కాంగ్రేస్ నాయకులు వంత పాడుతు అండగా నిలిచి అతనిని తిరిగి విదులలోకి తేవడానికి ప్రయత్నించడం దుర్మార్గమని, తమ ప్రయతాన్ని విరమించి బాదితులకు అండగా నిలిచి, పోయిన డబ్బును రికవరీ చేయించాలని ఏఐఎస్ఎఫ్ మహబుబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ గురువారం నాడు పత్రికా ముకంగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ నాయకులు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పు కుంటూ ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి అవినీతిపరులకు, దొంగలకు అండగా నిలిచి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మండల పరిదిలోని మద్దివంచ గ్రామంలో ఎన్ఆర్జిఆస్ పనులలో మేటి అని చెప్పుకొంటూ గత సంవత్సరం 200 మంది కూలీలకు రావల్సిన వేతనాలను తన సొంతవారికి బందువులకు అసలు పనే చేయని వారి ఖాతాలలో సుమారు నాలుగు లక్షలు జమచేయించి కాజేసినట్లు అడిట్ లో అదారాలతో రుజువు అయిందన్నారు, అధికారులు అతనితో కుమ్మక్కై, ఎలాంటి అవినీతి జరగలేదని ఏడితో చేప్పించుకున్నారు. అవినీతే జరగనప్పుడు 200 మంది కూలీల కస్టార్జితం 4లక్షల రూపాలు ఎటు పోయాయో అతనికి అండగా నిలుస్తున్న కాంగ్రేస్ నాయకులు వెలికితీయాలని అన్నారు. నిదుల దుర్వియోగం పై విచారణ జరిపించి కూలీల కు వారి కూలి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాల్సింది పోయి, అదికారులు తోలగించిన అతని జాబ్ కార్డును తిరిగి ఇప్పించెందుకు పైరవీలు చేయడం దుర్మార్గమని అన్నారు, ప్రభుత్వ పెద్దలు అధికారుల ఇప్పటికైనా చొరవచూపి నిదుల దుర్వినియోగం పై సమగ్ర విచారణ జరిపి పేద కూలీలలకు న్యాయం చేయాలని మాగం లోకేష్ కోరారు.