గార్ల సర్పంచ్ బానోత్ పార్వతి
మహా తెలంగాణ/ గార్ల ;-
ఆత్మరక్షణ కోసం అందరూ టైక్వాండో కరాటే విద్యలు నేర్చుకోవాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ అన్నారు,తెలంగాణ క్రీడాల విభాగం ద్వారా మహబూబాబాద్ జిల్లా డి.వై.ఎస్.ఓ.ఓ. జ్యోతి ఆదేశానుసారం గార్ల హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో తైక్వాండో కరాటే మాస్టర్ గంగుల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి కాల శిక్షణ క్రీడా శిబిరాన్ని ముగించారు ఈ కార్యక్రమానికి గార్ల మేజర్ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్, పెద్ద కిష్ణాపురం సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ నాయక్ గార్ల బాలికల హైస్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మాచర్ల సుందర్రావు డోర్నకల్ రైల్వే సీనియర్ మెడికల్ సూపర్డెంట్ సునీల్ కుమార్ ల సహాకారంతో క్రీడాకారులకు బహుమతులను అందజేశారు,ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్ గార్ల కరాటే మాస్టర్ గంగుల ప్రశాంత్ గార్ల బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ సూత్రపు జయశంకర్, బాస్కెట్బాల్ సీనియర్ క్రీడాకారుడు చంద్రశేఖర్ కరాటే కోచ్ లు తాళ్లూరి రామారావు షేక్ ఏజాష్ ఏ నరేష్ ఆర్ గాబ్రియేల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ గంగుల ప్రశాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన డి వై ఎస్ ఓ జ్యోతి గార్ల ఎస్ఐ బి సాయికుమార్ డోర్నకల్ రైల్వే సీనియర్ మెడికల్ సూపర్డెంట్ డి ఎం ఓ సునీల్ కుమార్ లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.