ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

మహబూబాబాద్ :

మహబూబాబాద్ జిల్లాలో ప్రీ-ప్రైమరీ విభాగానికి మంజూరైన 76 పాఠశాలలలో ఇన్‌స్ట్రక్టర్లు మరియు ఆయా పోస్టుల నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితాను సంబంధిత మండల కేంద్రాలలో ప్రదర్శించడం జరిగినదని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎ. సత్యనారాయణ మూర్తి తెలిపారు. అభ్యర్థులు ప్రదర్శించబడిన మెరిట్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లయితే, వాటికి సంబంధించిన ఆధార ధ్రువపత్రాలతో కలిసి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి (MEO) 06-07-2026 (సోమవారం) సాయంత్రం 5.00 గంటలలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. నిర్దేశించిన గడువు అనంతరం అందిన అభ్యంతరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవని, అందువల్ల సంబంధిత అభ్యర్థులు గడువులోపు తమ అభ్యంతరాలను సమర్పించుకోవాలని కోరారు. అన్ని అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేయబడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *