15న నిరుద్యోగ సమస్యలపై ఆందోళనలు
సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు గొల్లపల్లి నాగయ్య
మహా తెలంగాణ/మహబూబాబాద్ :
ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో మిలిటెంట్ ప్రజా ఉద్యమాలను నిర్వహించనున్నట్లు సిపిఐ (ఎం) రాష్ట్ర నాయకులు గొల్లపల్లి నాగయ్య వెల్లడించారు. మహబూబాబాద్ పెరమళ్ళ జగన్నాథ భవనం లో గత రెండు రోజులుగా జరుగుతున్న సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ భూమిలేని మహిళలకు ఉపాధి హామీ పథకం కింద 12000 ఇస్తామని ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించింది. దానిని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆసరా పథకం కింద దళిత ఎస్టి కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని ఊర్సే లేదని ఎద్దేవ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఒక్కంటికి 6 లక్షల రూపాయలు ఇండ్లు ను ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఆసరా పథకం ద్వారా పెన్షన్ 4 నుంచి 6వరకు పెంచు తమన్నారు. దానిని అమలు చేయడం ప్రభుత్వం అలసత్యం వహిస్తుందని నాగయ్య విమర్శించారు.ఇంకోవైపు రాముడిపేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్ప్పుడు ఆ రాముడికే శఠగోపం పెట్టిందని ఆరోపించారు. దేవాలయంలో దోపిడీ జరిగినా ప్రధాని మాట్లాడడం లేదు. రాష్ట్రంలో బిజెపి మెల్లిగా వారి పద్దతులను దిగుమతి చేస్తోంది. దీనికి ఆంధ్ర రాష్ట్రంలోని కుటమీ ప్రభుత్వం లో టిడిపి మద్దతిస్తోంది. ప్రశ్నించిన వారిని మాత్రం ఎలాంటి విచారణ చేయకుండా, వాస్తవాలు నిర్ధారించకుండా గంటల్లో అరెస్టు చేస్తున్నారు. అలాగే స్టాండప్ కమెడియన్లనూ వేధించారనీ ప్రశ్నించిన జర్నలిస్టులను ఉపచట్టం పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని. వెంటనే ఉపచట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడే సంప్రదాయం తెలుగు ప్రజలకు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే వేధింపులు ఆపాలి, అన్యాయంగా బనాయించిన కేసులను వెనక్కు తీసుకోవాలన్నారు.15న నిరుద్యోగ సమస్య పై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని, చలో హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
స్థానిక సమస్యలపై సర్వేలు చేయాలి..!
-జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలను ప్రభుత్వ పాఠశాలాలు, ప్రజా వైద్యశాలలను దళిత కాలనిలు , గిరిజన తండా లు, ప్రభుత్వం భూములను గుర్తింపు చేయాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుణగంటి రాజన్న, అలవాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, ఆకుల రాజు, కుంట ఉపేందర్, జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.