విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, న్యూట్రిషన్ పై ప్రత్యేక దృష్టి
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
మహాతెలంగాణ/ మహబూబాబాద్:
చిన్న గూడూరు మండలంలోని కేజీబీవీ విద్యాలయం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ స్నేహ షబరీష్ విద్యార్థినిగా మారి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, వసతి తదితర అంశాలపై స్వయంగా వివరాలు, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత, క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా చిన్నగూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కె జిబివి), జయ్యారం మండల ప్రజా పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూను తప్పనిసరిగా (పక్కాగా) అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సబ్జెక్టుతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నాణ్యతపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా డిజిటల్ తరగతుల ద్వారా ఉన్నత ప్రమాణాలతో బోధనలు నిర్వహించాలని,కెరియర్ గైడ్లైన్స్ తరగతులు, క్రీడా సాంస్కృతిక విద్యా విభాగాలలో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం యోగ, తదితర అంశాలలో శిక్షణ ఇప్పించాలని సూచించారు,విద్య సంస్థలలో చదువును అభ్యసించే పిల్లలకు, సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, రాష్ట్రీయ బాల స్వస్థ (ఆర్.బి.ఎస్.కె ) పథకం కార్యక్రమంలో భాగంగా ఎనిమిక్, హైజీన్, సీజనల్ వ్యాధులు జ్వరాలు, న్యూట్రిషన్ కార్యక్రమాల ద్వారా పిల్లల యొక్క మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని సూచించారు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల హాజరు వంద శాతం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు,పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ల ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధిక పర్యటనలు (18) విద్య సంస్థలు వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు, చేసి పిల్లలకు అందించే విద్య ఆహారం తదితర అంశాలలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటూ పిల్లలకు నాణ్యమైన విద్యకు కృషి చేస్తున్నారు. పంట మార్పిడి విధానం, వ్యవసాయం, ఆరోగ్యం, న్యూట్రిషన్, తదితర క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారానికి సంబంధించి ముక్కు సూటిగా వ్యవహరించి అక్కడికక్కడే సమస్యను పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది,ఈ రోజు జరిగిన చిన్న గూడూరు పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, తహసిల్దార్ కిరణ్ కుమార్, జిసిడిఓ వై.గాయత్రి, తదితరులు ఉన్నారు.