ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలి

BSP రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

నీట్ పరీక్ష పత్రాల లికేజికీ నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ లో విద్యార్థుల పై పోలీసుల లాఠి ఛార్జ్ నీ వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని డా:అంబేద్కర్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లికేజి వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, అనేకమంది విద్యార్డులు మళ్ళీ సీటు రాదేమోననే భయం తో ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. తక్షణమే విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్నారు. దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా, ఉద్యోగ అర్హత పరీక్షలు జరిగినా ఆ పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని, బజార్లో, జిరాక్స్ సెంటర్ లలో పరీక్ష పత్రాలు అమ్ముకుంటున్నారని అన్నారు. ఈ విధంగా పరీక్ష పత్రాలు అమ్ముకోవడం వలన కష్ట పడి చదివిన పేద విద్యార్థులు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలను బలితీసుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ఢిల్లీ లో లక్షలాది మంది విద్యార్థులు తమకి న్యాయం చేయాలని, విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలని శాంతియుత నిరసన తెలుపుతుంటే ఢిల్లీ పోలీసులు మరియు పోలీసుల ముసుగులో ఉన్న ఆర్. ఎస్. ఎస్. గుండాలు విద్యార్థులపై లాఠి ఛార్జ్ చేయడం దారుణం అన్నారు. పోలీసులు జరిపిన దాడిలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడి మరణించడం అత్యంత బాధాకరం అన్నారు. ఓ పక్క విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రధాని పట్టించుకోక పోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని, విద్యాశాఖా మంత్రి ఇద్దరూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని సుమెటో గా తీసుకొని విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ మేడపాటి శ్వేత ఇందిరా, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కాంత్, మాజీ జిల్లా ఇసంపెల్లి ఉపేందర్ జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, ప్రధాన కార్యదర్శి ధార ప్రసాద్ రావు, మహబూబాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు గూగులోతు నరేష్ నాయక్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు గుడ్డేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *