ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ
మానుకోటలో జైల్ బరో కార్యక్రమం
మహా తెలంగాణ/ మహబూబాబాద్ :
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు కర్షకులు, ప్రజలు, పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలో
పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మహిళలు పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటు తో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకు రావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంఘటిత పోరాటాల ద్వారా తగిన గుణపాఠం నేర్పాలన్నారు. మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి బీజేపీ పాలనకు చరమగీతం పాడితే తప్ప ఈ విధానాలను తిప్పి కొట్టలేమన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి, లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని స్వీమ్ వర్వర్లను, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. రాబోయే రోజులన్నీ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న, SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు, అంగన్ వాడి జిల్లా కార్యదర్శి గుండు సులోచన, మున్సిపాలిటీ కార్మికుల జిల్లా కార్యదర్శి కంపల్లి శ్రీనివాస్, ఆశ వర్కర్స్ జిల్లా కార్యదర్శి కరుణ, ఐకేపీ జల్లా అధ్యక్షురాలు నీలం కృష్ణ వేణి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కందునురి కవిత,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న నాయక్,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యమగాని వెంకన్న,హమాలీ సంఘం జిల్లా నాయకులు బాత్తుల వెంకన్న,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గారే కోటేశ్వరావు, సెక్రటరీ గర్డు జిల్లా అధ్యక్షులు వెంకట్ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి దేవత్ హేమ నాయక్ , పట్టణ ఇంచార్జి బానోత్ ప్రకాష్ నాయక్, టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు, పట్టణ కమిటీ సభ్యులు చంగంటి భాగ్యమ్మ, తోట శ్రీను,ఎర్ర శ్రీను, రజాక్.పులిగుజ్జు వెంకన్న.వీరనేని సుధాకర్. మందుల మహేందర్.భూక్యా రాజేష్. శాఖ కార్యదర్శి లు పార్టీ సభ్యులు సానుభూతి పరులు పాల్గున్నారు.