ఎస్ జి ఎఫ్ మహబూబాబాద్ జిల్లా సెక్రటరీగా ప్రవీణ్ రెడ్డి

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) మహబూబాబాద్ జిల్లా సెక్రటరీగా ప్రవీణ్ రెడ్డి నియామకమయ్యారు ఈ మేరకు నియామక పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి నుంచి మంగళవారం స్వీకరించారు. ఈ సందర్భంగా డిఇఓ సత్యనారాయణమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఎస్ జీ ఎఫ్ క్రీడలు ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో నిర్వహించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నిష్పక్షపాతంగా క్రీడాకారుల ఎంపికను చేసి ఆతిధ్యం ఇచ్చే వారు క్రీడాకారులకు మంచి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి క్రీడలు విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏసీ జీవో మందుల శ్రీరాములు, ఏ ఎం ఓ వెంకటేశ్వర్లు జిల్లా డీఎస్ఓ అప్పారావు, బేస్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్, తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం (టీజీ పేట) మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చాంప్లా నాయక్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు శంకర్ నాయక్, పుష్పలీల, రాజేందర్, జక్కి నాగేశ్వరరావు,అ వారి శ్రీనివాస్, నిర్మల, వెంకటేశ్వర్లు , రామయ్య, రాజేందర్, నాగిరెడ్డి, రాజు, దివ్యభారతి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *