మహాతెలంగాణ/మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) సెక్రటరీగా నూతనంగా నియామకమైన ప్రవీణ్ రెడ్డిని మహబూబాబాద్ జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కల్లూరి ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. మంగళవారం ప్రవీణ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎస్.జి.ఎఫ్ క్రీడల నిర్వహణ విజయవంతంగా నిర్వహించాలని, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అందరి సహకారం తీసుకొని క్రమశిక్షణతో జిల్లా నుంచి క్రీడాకారుల ఎంపిక నిష్పక్షపాతంగా నిర్వహించి మహబూబాబాద్ జిల్లా నుంచి వివిధ క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చాంప్లా నాయక్, శంకర్ నాయక్, ఫిజికల్ డైరెక్టర్లు పుష్పలీల, రాజేందర్, జక్కి నాగేశ్వరరావు, అవారి శ్రీనివాస్, నిర్మల, వెంకటేశ్వర్లు, రామయ్య, కొమ్ము రాజేందర్, నాగిరెడ్డి, రాజు, దివ్య భారతి, తదితరులు పాల్గొన్నారు.