మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాంలాల్
మహాతెలంగాణ/మరిపెడ :
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలు కృషి చేస్తాయని,బూత్ కమిటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువగా వెళ్లి ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని మరిపెడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పానుగోతు రామ్ లాల్ అన్నారు.గురువారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో రామ్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ బూత్ కమిటీల నిర్మాణం,ఎన్నికల ముందస్తు సమావేశానికి పీసీసీ అబ్జర్వర్ హవీజ్ ఖాన్,మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం ఈ సమావేశంలో 8వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కామసాని బుచ్చిరెడ్డి9వ వార్డు కమిటీ అధ్యక్షునిగా గంధసిరి సోమయ్య లను,ఉపాధ్యక్షులు,కార్యదర్శులు కోశాధికారులు,కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్, తిరుపతి,నీలా లచ్చిరామ్,జియో రమేష్,మాండన్ కాంతమ్మ కరణ్ సింగ్,పానుగోతు రాములు,కో ఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న,షేక్ అజీజ్ పాషా,కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధసిరి అంబరీష,షేక్ తాజోద్దీన్,మహ్మద్ అప్సర్,షేక్ అఫ్జల్,అలువాల ఉపేందర్ ప్రజాపతి,దేవరశెట్టి లక్ష్మినారాయణ,గంధసిరి బిక్షపతి,కారంపూడి ఉపేందర్,మహిళ నాయకులు పడిదం రాధిక,గుగులోత్ లచ్చిరామ్,కరణ్ సింగ్,గుండగాని వెంకన్న,రవికాంత్,సయ్యద్ సర్వర్,పర్వీన్,యాకుబ్జానీ,పాషా,షబ్బీర్,గ్యామా,కుమార్,కమలాకర్,అన్వేష్,నగేష్,తదితరులు ఉన్నారు.