మహిళా ప్రాయనికులపై దొంగల దాడి
మహా తెలంగాణ/గార్ల
గార్ల మండల కేంద్రంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో పలు వేరువేరు చోట్ల జరిగిన దొంగతనాలు మరువక ముందే ప్రయాణికుల పై దొంగల దాడి కలకలం రేపుతుంది. ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ సూర్య తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ నుండి మణుగూరు వేళ్ళు మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు గార్ల స్టేషన్ లో దిగగానే కిటికీ ప్రక్కనే కూర్చున్న మహిళా మెడలో నుండి బంగారు చైన్ ను దొంగలు లాగే ప్రయత్నం చేయగా మహిళా ప్రయనికురాలు కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుండి పరిపోయినట్లు ప్రయనికురాలు మహబుబాబాద్ ఆర్ పి ఎఫ్ పోకిసులకు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ రాత్రి వేళలలో ప్రయాణించే ప్రయాణికులు, మహిళలు కిటికీ ప్రక్కన కూర్చునే తప్పుడు కిటికీలు వేసుకుని అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు విలువైన ఆభరణాలు దరించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.