మహాతెలంగాణ/బయ్యారం
బయ్యారం మండల కేంద్రంలో బంజారా తీజ్ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా మాజీ చైర్మన్ ఆంగోతు బిందు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ తీజ్ పండుగ అనేది గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రకృతి పండుగ అని పేర్కొన్నారు. ముఖ్యంగా పెండ్లి కాని లంబాడి యువతులు ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారని తెలిపారు.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ తీజ్ పండుగలో గోధుమలను బుట్టల్లో చల్లి, వాటికి నీళ్లు పోస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సేవాలాల్ మహారాజ్, మేరమ్మా యాడిని ఆరాధిస్తూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.బంజారా సమాజం యొక్క సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడంలో తీజ్ పండుగకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందనిబయ్యారం మండల కేంద్రంలో ఈ పవిత్రమైన తీజ్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు బాబు, అజ్మీర రూప్లా నాయక్, భూక్య రవి, నాయక్ జరుప్లా శ్రీను నాయక్, భూక్య రమేష్ నాయక్, కిషన్ , గోపాల్ నాయక్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, బాల్య తండా సర్పంచ్ అజ్మీర దేవోజి నాయక్, రాంబాబు నాయక్, నరేష్ నాయక్, రాందాస్ నాయక్, చిన్న నాయక్ మహిళలు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.