గంజాయి అమ్మినా,సేవించినా సమాచారం అందించండి

పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణతో తల్లితండ్రులు నిఘా పెట్టాలి

ఎస్సై భానోత్ వెంకన్న

మహాతెలంగాణ/నర్సింహులపేట:

గంజాయి అమ్మినా,సాగు చేసినా,సేవించినా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమాచారం అందించాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న అన్నారు.జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్నను మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకన్నకు ను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ .. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి,నల్ల బెల్లం అమ్మే వ్యక్తుల సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ మిర్యాల వెంకన్న,సీనియర్ నాయకులు సంకపల్లి నరసింహారెడ్డి,మాజీ వార్డు సభ్యులు మదార్,రేఖ శ్రీను,బానోతు లక్పతి,కానిస్టేబుల్స్ తిరుమలేష్,ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *