రైతులు సాగులో సాంకేతిక మెలకువలను పాటించాలి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయకండి

ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

మహా తెలంగాణ/కురవి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేయవద్దని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు
మరిపెడ మండల కేంద్రంలోని ఏడి కార్యాలయంలో జరిగిన ఆత్మ కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ రైతులు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తక్కువ నీరు తీసుకునే పంటలను మాత్రమే వేసుకోవాలని, సాంప్రదాయక వరి సాగును తగ్గించుకొని పప్పు, చిరు నూనె ధాన్యాల సాగు తో పాటుగా కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు
సాగులో సాంకేతిక మెలుకువలను పాటించి అధిక లాభాలు గడించే విధంగా,అధిక మోతాదులో రసాయనాలను వాడకుండా, సేంద్రియ పద్ధతులను పాటించే విధంగా రైతులకు రెండు రోజులపాటు ఆయా మండల కేంద్రాల్లో నిపుణుల చే ఆత్మ కమిటీ ఆధ్వర్యంలోశిక్షణ తరగతులు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ సంచాలకులు మురళి, టెక్నికల్ ఏవో శ్రీదేవి, ఆత్మ కమిటీ సభ్యులు, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *