మాదక ద్రవ్యాలు,మతోన్మాదo పై యువత ఉద్యమించాలి*

నల్లు సుధాకర్ రెడ్డి ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు*

మహా తెలంగాణ/ కురవి

మాదకద్రవ్యాలు,మతోన్మాదానికి వ్యతిరేoగా యువత సమరశీల ఉద్యమాలు చేయాలని ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు కొరవి మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య మండల 9వ మహాసభల సందర్భంగా *సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ పతాకావిష్కరణ చేయగా,బొడ్డు ఉదయ్ అధ్యక్షతన* జరిగిన సభలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకవర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయని యువతలో ప్రశ్నించే తత్వాన్ని చంపడం కోసం కుల మత వర్గ వైశ్యామ్యాలను రెచ్చగొడుతూ, బోగస్  దేశభక్తి ముసుగులో, భక్తి,మూఢనమ్మకాలు, మాదకద్రవ్యాల వైపు యువతను నెట్టే విధంగా గత 12 ఏళ్లుగా బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, ఈ నేపథ్యంలో యువత ఉపాధి అవకాశాల కోసం, నిజమైన దేశభక్తిని ప్రకటిస్తూనే, ప్రగతిశీల భావాల వైపు సమీకరించే విధంగా ఏఐవైఎఫ్ పనిచేయాలని కోరారు *నూతన మండల కమిటీ అధ్యక్షుడు సoగెo జెన్ని, ప్రధాన కార్యదర్శి బొల్లు సాయి, ఆఫీస్ బేరర్స్ గా బొడ్డు ఉదయ్, కావటి గణేష్, బుర్ర ఉదయ్, బొల్లం అనిల్, దండ్రు వేణు, రేపాకుల ప్రశాంత్, దైద బాలు లను ఎన్నుకున్నారు* ఈ సమావేశంలో నాయకులు తురక రమేష్, కామెళ్ళ చరణ్, జక్కుల గణేష్,రాజేష్, అరుణ్ కుమార్, సంజయ్ సుమంత్, నందు, జెస్సు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *