మహాతెలంగాణ/మహబూబాబాద్:
భారత్ వికాస్ పరిషత్(బివిపి) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక ప్రతిష్టాత్మకమైన క్విజ్ పోటీ భారత్ కో జానో అని ఈనెల 31న బివిపి ఆధ్వర్యంలో భారత్ కో జానో” నిర్వహిస్తున్నట్లు బి వి పి అధ్యక్షులు ఓబిలిశెట్టి రామకృష్ణ, సెక్రటరీ జయప్రకాశ్ లోయ, ట్రజరర్ రేణిగుంట్ల గణేష్ కృష్ణ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం పాఠశాల, కళాశాల విద్యార్థులకు భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, రాజ్యాంగం మరియు సమకాలీన విషయాలపై అవగాహన కల్పించడం విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడం. భారతదేశ గొప్ప వారసత్వం, సంప్రదాయాలు మరియు విలువలను యువతరానికి పరిచయం చేయడం భారత్ కో జానో ఉద్దేశ్యమని వారు తెలిపారు. సాధారణ జ్ఞానంతో పాటు దేశానికి సంబంధించిన అన్ని రంగాల సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలు సాధారణంగా రెండు విభాగాలుగా జరుగుతాయని, కనిష్ట విభాగం (జూనియర్ ): 6వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులు. జ్యేష్ఠ విభాగం (సీనియర్ ) 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు పాల్గొంటారు.ఈ క్విజ్ పోటీలు మొదట పాఠశాల స్థాయిలో ప్రారంభమై బ్రాంచ్, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించబడతాయి.ఈ సంవత్సరం రాత పరీక్ష ను ఈ నెల 31 సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు మీ పాఠశాలలోనేనిర్వహిస్తున్నారుకావున మానుకోట జిల్లాలోని ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఈ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలని వారు కోరారు.