మహా తెలంగాణ/దంతాలపల్లి:
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష బారాస, భాజపా నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కుమ్మరి కుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏరుకొండ రమేష్ ఆరోపించారు. మంగళవారం దంతాలపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులను మోసం చేసింది బారాస ప్రభుత్వమేనని, వారి పట్ల ముసలి కన్నీరు కార్చడం సరికాదన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది కాంగ్రెస్ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉపకార వేతనాలు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని. గత ప్రభుత్వమే బకాయిలు చెల్లించలేదని విద్యార్థులు గమనించాలన్నారు. నియోజకవర్గాన్ని సామాగ్రాభివృద్ధికి ప్రభుత్వ విప్, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ కృషి చేస్తున్నారన్నారు. ఆధునికమైన నిర్మాణాలు ఇందిరమ్మ ఇల్లు లతో పాటు ఆయాభివృద్ధి పనులకు కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.