ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్ నాయక్
మహాతెలంగాణ/మహబూబాబాద్(సీరోల్ ):
సీరోల్ మండలంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామచందర్ నాయక్ పాల్గొన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి ఇస్లావత్ లచ్చిరాం నాయక్ ఏర్పాటు చేసిన భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్ నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.సమాజ అభివృద్ధికి బాటలు వేస్తూ, భావితరాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్ నాయక్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు