మెరుగైన సమాజం ఉపాధ్యాయులతోనే సాధ్యం

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

మెరుగైన సమాజం ఉపాధ్యాయులతోనే సాధ్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం జిల్లాలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విప్ మాట్లాడుతూ 15సంవత్సరాలు తరువాత సమాజాన్ని చూసే విద్యార్థులు ఉపాధ్యాయుల చేతుల్లో వున్నారన్నారు. ఉపాధ్యాయులు మార్పు కోరేలా విద్యా బోధనపై శ్రద్ధ పెట్టాలని విప్ రాంచంద్రునాయక్ సూచించారు.ప్రభుత్వ పాఠశాలలో చదివి మట్టిలో మాణిఖ్యం లా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ధిక కష్టాలకు ఓర్చుకుంటూ గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటూ ప్రతీ నెల ఒకటవ తేదీనే జీతాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కు దక్కుతుంది. ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో కిలోమీటర్లు దూరం నుంచి విద్యార్డులు వస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాల లకు తేడా ఏమిటని ఉపాధ్యాయులు ఆత్మ విమర్శ చేసుకోవాలని విప్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్ ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వ లక్ష్యంగా కృషిచేస్తోందని విప్ రామచంద్రనాయక్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న పరిజ్ఞానం ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయులకు ఉండదని అటువంటి అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతుల్లో సమాజం, రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఒక గురువు ఉపరాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలని రామచంద్రనాయక్ ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ స్నేహ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను అందించాలని, వారి బోధనకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులకు సిలబస్ తో కూడిన పాఠాలతో పాటు సామాజిక విషయాలలో కూడా అవగాహన కల్పించేలా ఉపాధ్యాయ విద్యాబోధన ఉండాలని, క్రమ శిక్షణతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విద్యార్థులను చైతన్యవంతులు చేయాలని కలెక్టర్ సూచించారు. సమాజంలో ఉపాధ్యాయులు రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఏ సి జి మందుల శ్రీరాములు, వార్డ్ కౌన్సిలర్ హైమావతి, కోఆర్డినేటర్స్ వెంకటేశ్వర్లు, వంగ సురేష్, సంతోష్, జి ఇ సి ఓ గాయత్రి, ఎం ఇ ఓ లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సతీష్ రెడ్డి, గీత, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *