జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు
మహాతెలంగాణ/మహబూబాబాద్
జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం శుక్రవారం పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి శ్రీ మందుల శ్రీరాములు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా చాలా ప్రతిభతో మిగతా పిల్లల మాదిరిగానే అన్ని సాధించాలని గొప్ప స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్నారని అటువంటి వారిని మనము ప్రోత్సహించి వారి వైకల్యాన్ని వారు మరిచే విధంగా వారిని చిన్నతనం నుండే అన్ని విధాలుగా ప్రోత్సహించటం వలన వారిలో దాగివున్న సామర్థ్యాలను వారు పెంపొందించుకొని అన్ని రంగాలలో రాణించగలుగుతారని పేర్కొన్నారు. ఎంతోమంది వైకల్యం కలవారు కూడా క్రీడలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగలిగారని అదేవిధంగా ప్రతి రంగంలో సాధారణ వారి కంటే కూడా మెరుగైనటువంటి ప్రతిభాపాటవాలను చూపి గొప్ప స్థాయికి చేరుకున్నారని అటువంటివారీ జీవితాలను స్ఫూర్తిగా తీసుకునే విధంగా వారి జీవిత గాధలను పిల్లలకు చిన్నప్పటినుండి తెలియజేయడం వల్ల వారిలో బలమైన ఆశయం పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి అప్పారావు, ఐ ఇ కోఆర్డినేటర్ వంగ సురేష్, జిఈసిఓ వై.గాయత్రి, ఏ ఎం ఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ వెంకటేశ్వర్లు,ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యురాలు డాక్టర్ సౌమ్య, జిల్లా లీగల్ సెల్ అడ్వైజరీ బాధ్యులు రాజకుమార్ మరియు ఆర్ పి లు అనిల్,, కపిల్, మమత, బిక్షపతి, రామకృష్ణ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ,ఐ ఈ ఆర్ పి లు సతీష్, రమేష్, రవి కుమార్ ,నరేష్ , జమునా ,కళ్యాణి, వీరేందర్ ,వీరయ్య, యాకయ్య మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన సుమారు 150మంది సి డబ్లూ ఎస్ ఎన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.