సేవా నగర్‌లో ఘనంగా కుంకుమ పూజ

మహా తెలంగాణ/మరిపెడ:

సేవా నగర్ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సేవా నగర్‌లో ప్రతిష్ఠించిన వినాయకుని వద్ద మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సేవా నగర్‌తో పాటు మరిపెడకు చెందిన పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సేవా నగర్ వినాయక అసోసియేషన్ సభ్యులు రెంటాల యాకయ్య,ములక అన్వేష్,సేవా నగర్ పెద్దలు పాల్గొన్నారు.అన్నదానానికి ఆహ్వానంసేవా నగర్ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, సేవా నగర్ ప్రజలు,మరిపెడ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్నివి విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *