మహా తెలంగాణ/మరిపెడ:
మరిపెడ పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షుడు గుగులోతు రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 112 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద,మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామనితెలిపారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, తాజుద్దీన్,సర్పంచులు,వార్డు కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.