మహబూబాబాద్, జూన్.04
బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్లకు “ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం” పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో ఫార్మసీ ఆఫీసర్లు అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన, తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్, ఐ యు సి డి, జిల్లాకు వచ్చిన మందులు, అన్నీ కూడా పోర్టల్ లో, అప్లోడ్ చేయాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డెమో కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, లో కియా, ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.