కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల

కాంగ్రెస్ మరిపెడ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్

మరిపెడ

కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి పేద వాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను అందిస్తూ వారికి సకాలంలో బిల్లులను మంజూరు చేస్తుందని మరిపెడ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ అన్నారు. గురువారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సిఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నాయకత్వంలో డోర్నకల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగానే పేదలకు ఇందిరా మహిళలను మంజూరు చేసి లబ్ధిదారులకు బేస్మెంట్ లెవల్లో ఉన్న ఇళ్లకు మొదటి విడత గా లక్ష రూపాయలు తమ ఖాతాలో జమ చేయటం జరుగుతుందన్నారు. తద్వారా లబ్ధిదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *