మార్కెట్ వ్యాపారస్తులకు షాప్ లు కేటాయింపు
కన్యకా పరమేశ్వరి వద్ద గుంచీలు కోల్పోయిన వారికి మార్కెట్ పరిసరాల్లో ప్రత్యామ్నాయం చూపించాలి
బి అజయ్ సారధి రెడ్డి
నేడు మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ పార్క్ లో ప్రత్యామ్నాయంగా కూరగాయలు అన్ని వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు అందరికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం సరిగా నిధులు కేటాయించకుండా మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిన మార్కెట్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రత్యేక చొరవ చూపి ఒక కోటి రూపాయలు కేటాయించి పనులు పూర్తి చేయగా నేడు మార్కెట్ వ్యాపారస్తులకు డ్రా పద్ధతిలో షాపులను కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఎమ్మెల్యే చొరవతో మార్కెట్ పూర్తయినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర షాప్లు కోల్పోయిన చిరు వ్యాపారులను నాడు ఎమ్మెల్యే మరియు కమిషనర్ హామీ మేరకు మార్కెట్ పరిసరాల్లో వారికి కూడా ప్రత్యామ్నాయంగా జీవనోపాధి చూపించాలన్నారు ఈ సందర్భంగా గుంజీలు కోల్పోయిన వారందరూ తో కలిసి ఈరోజు మున్సిపాలిటీలో కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గుంజీలు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని మరియు నూతనంగా షాపులు కేటాయిస్తున్న చిరు వ్యాపారులకు అధిక పనులు లేకుండా నూతన షాపులు కేటాయించాలని గతంలో ఈ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించిన గుంచీలు కోల్పోయిన వారందరికీ న్యాయం చేయాలని కోరారు
కార్యక్రమం లో పెరుగు కుమార్ చింతకుంట్ల కవిత, sk యూసుఫ్, సత్తెమ్మ, యాకప్ పాషా, ఎండీ రహీం, బోళ్ల భద్రయ్య, హైమద్
మరియు నూతనంగా షాపులు పొందిన మార్కెట్ వ్యాపారస్తులు గీసా గాని కుమార్ వెంకట్రావు తిరుమల్ సురేందర్ రాము సాయి తదితరులు పాల్గొన్నారు