మహబూబాబాద్ దేవుని గుట్టపై ఇనుప యుగపు రాతి చిత్రకళ

పురావస్తు పరిశోధకులు డా. ఈమని శివనాగిరెడ్డి వెల్లడి

మహబూబాబాద్ :

మహబూబాబాద్ శివారు దేవుని గుట్టపై ఇనుప యుగపు రాతి చిత్రాల ఆనవాళ్లు ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ ఆదేశాల మేరకు శనివారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం దేవుని గుట్టపై తిరుగుతుండగా ఈ చిత్రాలను చూసినట్లు ఆయన తెలిపారు. రెండు అడుగుల పొడవు, అర్ధ సెం.మీవెడల్పు, పావు సెం.మీ లోతు రాతిని ఇనుప ఉలి తో కొట్టగా ఏర్పడ్డ రెండు రేఖలు కనిపించాయని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ముదురు గోధుమ రంగు ఆకృతి ద్వారా అవి ఇనుప యుగానికి చెందినవిగా డా. నాగిరెడ్డి చెప్పారు. ఆయన వెంట అరుణ్ నాయక్, భీమా నాయక్, అనుమాల వెంకటేశ్వర్లు, గోపాల్ గిల్డా, మాలే శ్రావణ్ కుమార్, రాజేశ్వరరావు, విశ్వనాథం, కల్లూరి ప్రభాకర్ పా

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *